ఎమిరేటీ, ఎక్స్‌పాట్ పేషెంట్లకు ఉచిత వైద్య చికిత్స
- September 19, 2016
అబుదాబీ: పేషెంట్లు, వారి సంబంధీకులు, వ్యక్తులు కొన్ని ప్రత్యేక డిసీజ్‌లకు ఉచిత వైద్య చికిత్స పొందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆంత్రాక్స్, కలరా, అవియాన్ ఇన్‌ఫ్లుయెంజా, హెచ్‌ఐవి ఎయిడ్స్ వంటి వ్యాధులకు చిత చికిత్స అందించనున్నారు. ఆరు నెలల్లో దీనికి సంబందించిన చట్టం అమల్లోకి రానుంది. పౌరులు అలాగే, విజిట్ లేదా రెసిడెన్స్ వీసాతో దేశంలో ఉంటున్నవారికి ఈ వైద్య చికిత్స అందుతుంది. ఫుడ్ పాయిజనింగ్, డిఫ్తీరియా, అక్యూట్ ఫ్లాసిడ్ పరాలసిస్, బోటులిజమ్ మరికొనిన వ్యాధులకు కూడా ఈ వైద్య చికిత్సలో కవర్ ఉంటుంది. ఉచిత హెల్త్ కేర్‌లో వైద్య పరీక్షలు, చికిత్స, మందులు, వాక్సినేషన్ వంటివి కూడా ఉంటాయి. చట్టం ప్రకారం వ్యాధిగ్రస్తులకు పూర్తి ప్రైవసీ కూడా ఇస్తారు. అయితే డిపోర్టేషన్ రూల్స్ మాత్రం యధాతథంగా ఉంచారు వలసదారులకు సంబంధించి. వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు సంబంధిత ఆసుపత్రులు లేదా క్లినిక్స్‌లో సంప్రదించి, తమ వివరాల్ని నమోదు చేసుకోవలసి ఉంటుందనీ, ఆయా వ్యాధులకు వైద్య చికిత్స, మెడికల్ కౌన్సిలింగ్ వంటివి నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









