రైడ్ హెయిలింగ్ యాప్స్‌పై కొత్త రెగ్యులేషన్స్
- September 19, 2016
అబుదాబీ: ఉబెర్, కరీమ్ వంటి సంస్థలు నిర్వహిస్తోన్న రైడ్ హెయిలింగ్ యాప్స్‌పై కొత్త రెగ్యులేషన్స్ త్వరలో అమల్లోకి రానున్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఉబెర్, అలాగే దేశంలో ఉబెర్కి గట్టి పోటీ ఇస్తున్న కరీమ్ సంస్థలు యాప్ ద్వారా వినియోగదారులకు పెయిడ్ ట్యాక్సీ సర్వీసుల్ని అందిస్తున్నాయి. అయితే ఈ సేవల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే కోణంలో అధికారులు చర్యలు చేపట్టారు. దాంతో ఉబెర్, కరీమ్ సంస్థలు యాప్ సర్వీసుల్ని నిలిపివేశాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత యాప్ సర్వీసుల్ని కొనసాగిస్తామని ఆయా సంస్థలు వెల్లడించాయి. అయితే, అధికారులు ఆరోపిస్తున్నట్లుగా ఎలాంటి అక్రమాలకూ తాము చోటివ్వడంలేదని ఈ సంస్థలు చెబుతుండడం జరుగుతోంది. రైడ్ హెయిలింగ్ యాప్స్, సెంటర్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బై హైర్ కార్స్ (ట్రాన్సాద్)లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందనీ, త్వరలోనే నిబంధనలు ఖరారవుతాయని జనరల్ మేనేజర్ మొహమ్మద్ దార్విష్ అల్ కామ్జి చెప్పారు. ట్రాన్సాద్ ఏడు ఫ్రాంచైజీ ట్యాక్సీ కంపెనీలతో పనిచేస్తోంది. 7,645 రిజిస్టర్డ్ ట్యాక్సీలు అబుదాబీలో పనిచేస్తున్నాయి. 2013లో ఉబెర్ తమ సర్వీసుల్ని అబుదాబీలో ప్రారంభించింది.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







