షార్లట్ నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు..
- September 22, 2016
అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో ఉన్న షార్లట్ నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు. పోలీసు కాల్పుల్లో నల్లజాతీయుడి మృతి చెందడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. మంగళవారం పోలీసు అధికారి బ్రింట్లీ విన్సెంట్ జరిపిన కాల్పుల్లో 43ఏళ్ల కీత్ లామంట్ స్కాట్ మృతి చెందడంతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. వరుసగా రెండో రోజు ఆందోళనలతో షార్లట్ అట్టుడికింది. దీంతో షార్లట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో షార్లట్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఉత్తర కరోలినా గవర్నర్ పాట్ మెక్ క్రోరీ ప్రకటించారు. ఆందోళనలను అదుపు చేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించినట్టు తెలిపారు.
ఆందోళనకారులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. షార్లట్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు చేపట్టామని మేయర్ జెన్నిఫర్ రాబర్ట్స్ తెలిపారు. ఆందోళనకారులు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని, పోలీసు కాల్పుల ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపడతామని హామీయిచ్చారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







