అబుదాబీలో 188 కార్ల స్వాధీనం
- September 21, 2016
అబుదాబీ: అబుదాబీలో అధికారులు 188 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్ లాట్స్‌లో నిర్లక్ష్యంగా వదిలేసిన ఈ వాహనాల్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఇప్పటికే 175 వార్నింగ్స్ కూడా వాహన యజమానులకు పంపించారు. గత నెలలో ప్రారంభించిన క్యాంపెయిన్‌లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా వాహనాల్ని వదిలివేయరాదనీ, అలా వదిలేస్తే దుమ్ముపట్టిన వాహనాలతో నగరం అపరిశుభ్రంగా కనిపిస్తుందని గత కొన్నాళ్ళుగా వాహనదారుల్ని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చారు. అయితే కొందరు అధికారుల సూచనల్ని, హెచ్చరికల్ని లెక్క చేయని కారణంగా ఆయా వాహనాల్ని అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వార్నింగ్ లెటర్స్ పంపిన తర్వాత మూడు రోజుల్లోగా సంబంధిత వాహనాల యజమానులు స్పందించకపోతే, ఆ వాహనాలు టౌల్ చేయబడతాయి. అల్ వత్‌బా ఇంపౌండింగ్ యార్డ్‌కి ఆ వాహనాల్ని తరలించి, చట్ట పరమైన చర్యల్ని వాహనదారులపై తీసుకోవం జరుగుతుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







