నిరుద్యోగ బీసీ విద్యార్థులకు శుభవార్త--కొల్లు రవీంద్ర
- September 22, 2016
రాష్ట్రంలోని నిరుద్యోగ బీసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌మేళా వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనిలో రాష్ట్రంలోని వివిధ కంపెనీలు, వాటిలో ఖాళీలు, అర్హతలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. గురువారం రాష్ట్ర బీసీ, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ వెబ్‌సైట్‌ను విజయవాడలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీ వెబ్సైట్ పబ్లిక్ డొమైన్లో ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తమకు కావల్సిన కంపెనీని వెబ్సైట్లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు 13 కంపెనీలు, 1048 ఉద్యోగాలు దీనిలో రిజిష్టర్ అయ్యాయని ఆయన చెప్పారు. వచ్చే నెల 15వ తేదీన రాజమండ్రిలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు.
ఎన్టీఆర్ విదేశీ విద్య రుణం ద్వారా ఇప్పటి వరకు 78 మందిని విదేశాలకు పంపించామన్నారు. 750 మందికి సివిల్స్ కోచింగ్ ఇస్తున్నామని, 650 మందిని బ్యాంక్ పరీక్షల కోసం ఎంపికచేశామని ఆయన తెలిపారు. అలాగే బీసీ యువతను యువపారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు రూ. 25 లక్షలతో చిన్నయూనిట్లను నెలకొల్పుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







