'బంగారు తాళి' పథకానికి భారీ నిధులు కేటాయింపు
- September 22, 2016
తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన 'తాళికు తంగమ్' పథకానికి 2016-17 సంవత్సరానికి గాను రూ.204 కోట్లు కేటాయించింది. దీని ద్వారా 12,500 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. పేద కుటుంబాలకు చెందిన వధువులకు బంగారు మంగళసూత్రం చేయించేందుకు ఈ పథకం ద్వారా నగదును అందిస్తారు. ఇదే పథకం కింద పదవ తరగతి ఉత్తీర్ణులైన అమ్మాయిలకు రూ.25,000, డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసిన వారికి రూ.50,000 ఆర్థికసాయం కింద ప్రభుత్వం ఇస్తుంది.
2011 ఎన్నికల సందర్భంగా ఏఐఏడీఎంకే నిరుపేద కుటుంబాల వధువులకు 4 గ్రాముల బంగారు మంగళసూత్రం చేయించి ఇస్తామని హామీ ఇచ్చింది.
2016 శాసనసభ ఎన్నికల సందర్భంగా దాన్ని రెట్టింపు చేస్తూ 8గ్రాముల బంగారం ఇస్తానని హామీ ఇచ్చింది. జయలలిత నియోజకవర్గమైన డా.రాధాక్రిష్ణన్ నగర్, కాంచీపురంలలో ఈ పథకాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు 8 గ్రాముల బంగారు నాణేలను అందించారు. 2016 మే 23 తర్వాత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 12,500 మంది మహిళలకు 8గ్రాముల బంగారు నాణేన్ని, అంతకు ముందు దరఖాస్తు చేసుకున్న 1.4 లక్షల మందికి 4 గ్రాముల బంగారు నాణేన్ని అందివ్వనున్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







