మటన్ దోసకాయ కూర
- September 22, 2016
కావలసిన పదార్థాలు: మటన్ - అర కేజీ, దోస ముక్కలు - 2 కప్పులు, ఉల్లిపాయ తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, దనియాలపొడి - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, కారం - 2 టీ స్పూన్లు, గరం మసాల - పావు టీ స్పూను, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం: కుక్కర్లో ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. పసుపు, కారం, ఉప్పు, దనియాలపొడి వేసి నిమిషం తర్వాత మటన్ ముక్కలు కలిపి నీరు ఇగిరిపోయేదాకా సన్నని సెగమీద ఉంచాలి. తర్వాత అరకప్పు నీరు పోసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. (స్టౌవ్ ఆపేసి, కుక్కర్ చల్లబడ్డాక) దోసకాయ ముక్కలు వేసి మరో విజిల్ వచ్చేవరకు ఉంచి గరం మసాల, కొత్తిమీర తరుగు చల్లాలి. ఈ కూర అన్నంతోనూ, పరాటాలతోనూ బాగుంటుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







