ఇతడ్ని మీరు ఎక్కడైనా చూశారా?
- September 22, 2016
రాయ్‌గఢ్ జిల్లాలోని ఉరాన్ సైనిక స్థావరం వద్ద అనుమానితుల సంచారంపై ముంబయి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తీర ప్రాంతంలో రెండో రోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు అందించిన సమాచారం మేరకు.. ఓ అనుమానితుడి వూహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు.
ముంబయిలో గురువారం అనుమానితుల సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉరాన్ సైనిక స్థావరం సమీపంలో పఠాన్ సూట్లు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు, సాధారణ దుస్తుల్లో ఉన్న మరో వ్యక్తి ఆయుధాలతో తిరుగుతున్నారని కొందరు పాఠశాల విద్యార్థులు స్కూల్ యాజమాన్యానికి చెప్పారు.
దీంతో వారు పోలీసులకు సమాచారమందించారు. దీంతో ముంబయి తీరం, పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రంగంలోకి దిగిన ఏటీఎస్, రాష్ట్ర పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఉరీ ఉగ్రదాడి తరువాత దేశంలోని పలు సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు చేయొచ్చని నిఘా వర్గాలు హెచ్చరికల జారీచేశాయి. ఈ నేపథ్యంలో అనుమానితుల సంచారంపై సమాచారం రావడంతో నౌకాదళం అప్రమత్తమైంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







