క్యాబ్ డ్రైవర్ నిజాయితీ
- September 23, 2016
షార్జా: పాకిస్తానీ డ్రైవర్ నాసిబల్లా షీర్, తన ట్యాక్సీలో ప్రయాణీకులు మర్చిపోయిన బ్యాగ్‌ని తిరిగిచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు. కొరియాకి చెందిన వ్యాపారవేత్త ఒకరు, షీర్‌కి చెందిన క్యాబ్‌లో షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణించాడు. అయితే ఆ వ్యాపారవేత్త కంగారులో తన బ్యాగ్‌ని ట్యాక్సీలో మర్చిపోయాడు. అది గమనించిన ట్యాక్సీ డ్రైవర్ షీర్, తనకు లభించిన బ్యాగ్‌ని ఎయిర్‌పోర్ట్‌లోని ఆర్‌టిఎ ట్యాక్సీ ఆఫీస్‌లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. షార్జా పోలీసులు కొరియన్ విజిటర్‌ని గుర్తించి, ఆ బ్యాగ్‌ని అందజేశారు. సార్జా ఆర్‌టిఎ ట్రాన్స్‌పోర్ట్ ఎఫైర్స్ డైరెక్టర్ అబ్దుల్ అల్ జర్వాన్, షీర్ నిజాయితీని గుర్తించి, ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఇటీవలి కాలంలో మొత్తం 265 మంది క్యాబ్ డ్రైవర్లు ఈ విధంగా స్మనించబడ్డారు. వారికి 310,000 క్యాష్ ప్రైజ్‌ని కూడా అందించినట్లు షార్జా ఆర్‌టిఎ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







