ఆరుగురు వాహన డ్రైవర్ల లైసెన్సులు రద్దు
- September 23, 2016
మనామా: వాసర్షిక ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల లిమిట్‌ని అధిగమించిన ఐదుగురు డ్రైవర్లకు చెందిన లైసెన్సుల్ని రద్దు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించింది. యాక్టింగ్ డైరెక్టర్ - జనరల్ ఆఫ్ ట్రాఫిక్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అలి దరాజ్ మాట్లాడుతూ, లైసెన్సులు రద్దు చేయబడిన ఐదుగురు వ్యక్తులు ఒక్కొక్కరు 20 ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల పాయింట్లను దాఓటినందున చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అక్రమ డ్రాగ్ రేసింగ్స్, కార్ స్టంట్స్, జంపింగ్ రెడ్ సిగ్నల్స్ అలాగే ఓవర్ స్పీడింగ్ వంటి చర్యలకు సదరు డ్రైవర్లు పాల్పడినట్లు వివరించారు. వీరిలో బహ్రెయినీలు, ఆసియాకి చెందినవారు ఉన్నారు. వీరిలో కొందరు పదే పదే నిబంధనల్ని ఉల్లంఘించారు. కొందరు ఒకే నిబంధనని మళ్ళీ మళ్ళీ ఉల్లంఘించారు. రోడ్లపై వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ, తద్వారా చట్టపరమైన శిక్షలు తప్పించుకోగలుగుతారనీ, అలాగే ప్రమాదాలకు లోనుకారని అల్ దరాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







