హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి...
- September 23, 2016
హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాలు మరియు ఆరోగ్యకర జీవనశైలి మాత్రమేకాకుండా, ఇక్కడ తెలిపిన అలవాట్లకు దూరంగా ఉండాలి.
1
పొగతాగటం
పొగతాగే అలవాటు ఉన్నవారికి కూడా తెలుసు ఈ అలవాటు వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉందో. పొగతాగే అలవాటు వలన రక్తపీడనం, రక్తనాళాలలో అడ్డంకులు మరియు ఆరోగ్యకర (HDL) తగ్గటం వంటి గుండె సంబంధిత వ్యాధులు అధికమయ్యే పరిస్థితులు పెరుగుతాయి. పొగతాగే అవలవాటును మాని వాటి వలన కలిగే ప్రయోజనాలను చూడండి.
2
ఛాతి నొప్పి పట్ల అశ్రద్ధ
చాలా మంది ఛాతిలో కలిగే నొప్పి గురించి శ్రద్ధ తీసుకోరు. అతిగా ఉండే బరువును లేపటం లేదా భోజనంలో ఎక్కువగా ఆహరం తీసుకోవటం వలన ఛాతిలో నొప్పి కలుగుతుంది అనుకుంటారు కానీ, గుండెలో ఎదో సమస్య వలన ఛాతి నొప్పి కలుగుతుందని వారు గమనించరు. ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలవండి.
3
చెక్ చేపించుకోకపోవటం
క్రమంగా మీ ఆరోగ్యం గురించి చెక్ చేపించుకోవటం వలనే మీరు ఎలాంటి అనారోగ్యాలకు గురవబోతున్నారో అని తెలుస్తుంది. అధిక రక్తపీడన స్థాయిలు మరియు అధిక కొవ్వు పదార్థాల వంటి గుండె సంబంధిత వ్యాధులకు సులువుగా చికిత్స చేయవచ్చు.
4
పెరిగే పొట్టను పట్టించుకోకపోవటం
ఉదర భాగం పెరగటం గురించి పట్టించుకోకపోవటం మనలో చాలా మంది చేసే ఒక తప్పిదం. ప్రతి సంవత్సరం పొట్ట పరిమాణం పెరుగుతుంది అంటే, ఇది చాలా చింతించాల్సిన విషయం. ఇలా పొట్ట భాగంలో అదనపు కొవ్వు పదార్థాలు చేరుటను జీవక్రియ వైపరీత్యం (మెటబోలిక్ సిండ్రోం) యొక్క బహిర్గత లక్షణం అని చెప్పవచ్చు. దీని వలన గుండె వ్యాధులు, గుండెపోటు లేదా డయాబెటిస్ వంటి సమస్యలు కలుగుతాయి.
5
రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోకపోవటం
మీ రక్తపీడన స్థాయిలు పెరిగినపుడు తగిన చికిత్స అందించని ఎడల, గుండె వ్యాధులు మీరే ప్రోత్సహిస్తున్నారని అర్థం. అధిక రక్త పీడన స్థాయిలు గుండె రక్త పంపిణిని కష్టతరం చేస్తాయి మరియు ధమనులను గట్టి పరుస్తాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ మరియు ఇతర హృదయ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







