కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
- September 23, 2016
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాందంలో బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ముజఫరాబాద్ కు ఉత్తర దిశగా 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అదుపుతప్పిన బస్సు.. సుమారు 100 మీటర్ల ఎత్తునుంచి వేగంగా ప్రవహిస్తున్న నదిలో పడటంతో కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 23 మందికి పైగానే మృతిచెందారని, తీవ్రంగా గాయపడిన ముగ్గురిని రక్షించడంతో పాటు.. ముగ్గురి మృతదేహాలు మాత్రం లభించాయని స్థానిక అధికారి గిలానీ వెల్లడించారు. నదిలో కొట్టుకుపోయిన బస్సుతో పాటు మృతదేహాలకోసం గాలింపు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







