25వ తేదీన ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖీ చర్చా..
- September 23, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీన ప్రవాసాంధ్రులతో ముఖాముఖీ చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రవాసాంధ్రులతో జగన్ నేరుగా మాట్లాడతారు. ప్రపంచవ్యాప్తంగా ఐదుచోట్ల నుంచి ఎన్నారైలు.. వైఎస్ జగన్‌తో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అలాగే డిజిటల్ మాధ్యమంలో సాక్షి యూట్యూబ్ చానల్ Https://youtu.be/k4kM4PVNt8l లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. ఎన్నారైలు ఏర్పాటు చేసుకున్న https://www.youtube.com/channel/UC4oQR_IibE2AK_h78czulrQ లింకు ద్వారా కూడా దీన్ని వీక్షించవచ్చు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







