జపాన్ 'డ్రైవింగ్ బరిస్టా' యాప్ ను రూపొందించింది
- September 24, 2016
నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురై ఎంతోమంది మృత్యువాతపడుతున్నారు. అందుకు ప్రధాన కారణం నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోపాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కూడా. వాహన చోదకులకు అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రావట్లేదు. అయితే దీనికి జపాన్‌లోని టొయోటా మోటార్స్ చక్కని పరిష్కారాన్ని కనుగొంది. అదేంటంటే..
జపాన్‌కి చెందిన టొయోటా మోటార్స్ కార్పొరేషన్ లిమిటెడ్, కేడ్డీకార్పొరేషన్‌లు కలిసి సంయుక్తంగా ఓ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను రూపొందించాయి. దాని పేరు 'డ్రైవింగ్ బరిస్టా'.
ఈ యాప్‌లో ఓ ప్రత్యేకత ఉంది. కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ తెరిచి ఉంచాలి. యాప్ తెరవగానే ఫోన్‌ను పక్కన పెట్టేసి ప్రయాణం ప్రారంభించాలి. కారు ఎక్కడైతే ప్రారంభం అవుతుందో అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం వెళ్లే వరకు మన ప్రయాణాన్ని ఈ యాప్ రికార్డు చేస్తుంది. ఎవరైతే డ్రైవింగ్‌లో ఆ వంద కిలోమీటర్ల వరకు ఫోన్‌ని తాకకుండా ఉంటారో వాళ్లు రుచికరమైన కాఫీ కూపన్‌ను గెలుచుకుంటారు. ఒకవేళ మధ్యలోనే ఫోన్‌ని ముట్టుకున్నారంటే యాప్‌లో రీడింగ్ మళ్లీ సున్నాకి పడిపోతుంది.ఈ యాప్‌లో గెలుచుకున్న కూపన్‌ను చూపిస్తే జపాన్‌లోని 'కొమెదా' కాఫీ షాప్‌లో రుచికరమైన కాఫీని ఉచితంగా అందిస్తారు. ఇలా ఎన్ని వందల కిలోమీటర్లు వెళితే అన్ని కాఫీ కూపన్లు గెలుచుకోవచ్చన్నమాట.కొత్తగా ఉంది కదా ఈ అప్లికేషన్. దీనిని ప్రవేశపెట్టడానికి ఓ కారణం ఉందంటుంది ఆ సంస్థ. ''గత ఏడాది జపాన్‌లో సుమారు 4,43,639 మంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిలో 50,101 మంది మృత్యువాతపడ్డారు. దురదృష్టవశాత్తు ఇవన్నీ సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్లనే సంభవించాయి. ఇలా ఏటా వేలమంది ప్రాణాల్ని కోల్పోవడం చూసి ప్రమాదాలను నివారించేందుకు స్థానిక ప్రభుత్వం మాతో చర్చించింది. దాంతో ఓ నిర్ణయానికి వచ్చాం. అయితే మామూలుగా చెబితే ఎవరూ దానిపై శ్రద్ధచూపరు. అందుకే వినూత్నంగా ఏదైనా చెయ్యాలని ఆలోచించి ఈ డ్రైవింగ్ బరిస్టా అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో ఓ వైపు భద్రత మరోవైపు డ్రైవర్‌కు అసక్తికరమైన డ్రైవింగ్ అనుభూతి కలుగుతుంది. దీంతో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించొచ్చని భావిస్తున్నాం'' అని ఆ సంస్థ పేర్కొంది.నిజమే సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ని అరికట్టాలంటే ఇలాంటి స్మార్ట్ ఐడియాలే కరెక్ట్. మన దగ్గర కూడా ఇలాంటివి వస్తే బాగుంటుంది. చూద్దాం డ్రైవింగ్ బరిస్టా మన ముంగిట్లో కూడా వాలుతుందేమో.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







