రొమేనియాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదు
- September 24, 2016
శనివారం ఉదయం రొమేనియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. పొరుగున ఉన్న బల్గేరియా, మోల్దోవాలలోనూ ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. వ్రాన్సియాలో 91.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు భూ విజ్ఞాన శాస్త్ర అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉన్న ప్రాంతమని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇవాళ్టి భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని పేర్కొన్నారు. 1977లో ఇక్కడ 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినపుడు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







