ఎవరూ స్పృశించని విభిన్నమైన కథ 'ఘటన'..
- September 24, 2016
''ఆడదంటే ఆటబొమ్మ కాదు.. ఆది పరాశక్తి అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. నిత్యా మీనన్ అద్భుతంగా నటించింది'' అన్నారు దర్శకురాలు శ్రీప్రియ. క్రిష్ జె.సత్తార్, నిత్యా మీనన్ జంటగా 'దృశ్యం' ఫేమ్ శ్రీప్రియ దర్శకత్వంలో వీఆర్ కృష్ణ.యం నిర్మించిన సినిమా 'ఘటన'. మలయాళంలో ఘన విజయం సాధించిన '22 ఫీమేల్ కొట్టాయం' చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. శనివారం ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు. అతిథిగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ''ఎవరూ స్పృశించని విభిన్నమైన కథ ఇది.నర్సు ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లే అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనే విషయాల ఆధారంగా శ్రీప్రియ ఈ సినిమా తీశారు.ఇటువంటి మహిళా సినిమాలు తీయడానికి మహిళా దర్శకురాలే కరెక్ట్'' అన్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వీఆర్ కృష్ణ.యం తెలిపారు. నరేశ్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: మనోజ్ పిళ్లై, పాటలు: అనంత శ్రీరామ్, సంగీతం: అరవింద్ శంకర్, సమర్పణ: బేబీ సంస్కృతి.యం, బేబీ అక్షర.యం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







