మహేష్ సినిమా టైటిల్ 'ఎనిమీ' ...
- September 24, 2016
మురగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. అయితే, ఈ చిత్రం టైటిల్ విషయంలో ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మహేష్ సినిమా టైటిల్ ఇదేనంటూ 'ఎనిమీ' టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా, మరో రెండు టైటిల్స్ వెలుగులోనికి వచ్చేశాయి. మహేష్ సినిమా కోసం శివ, అభ్యిమన్యుడు టైటిల్స్ ని పరిశీలిస్తున్నారంట.
మరోవైపు, మహేష్ సినిమా కోసం ఇప్పటి వరకు ఎలాంటి టైటిల్ ని ఖరారు చేయలేదని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మురగదాస్. అయినా.. టైటిల్ పై ప్రచారం మాత్రం ఆగడం లేదు. మహేష్ సినిమా టైటిల్ ఏంటో తెలియాలంటే..దీపావళి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. దీపావఌ కానుకగా మహేష్ సినిమా టీజర్ ని రిలీజ్ చేయనుంది. దీంతో.. మహేష్ సినిమా టైటిల్ ఏంటన్నది తెలిసిపోనుంది. టీజర్ కటింగ్ లో మురగదాస్ స్టయిలే వేరు. ఇందుకోసం ఒకరోజుని ప్రత్యేకంగా కేటాయించనున్నాడు మురగ.ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. దర్శకుడు ఎస్. జె సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. డిసెంబర్ లో చిత్ర షూటింగ్ ని పూర్తి చేసి.. సినిమాని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు మురగ.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







