'కాటమరాయుడు' సెట్స్ పైకి వెళ్లింది...

- September 25, 2016 , by Maagulf
'కాటమరాయుడు' సెట్స్ పైకి వెళ్లింది...

ఎట్టకేలకు పవన్ సినిమా పట్టాలెక్కింది. పవన్-డాలీ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం 'కాటమరాయుడు'. చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో కీలక సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే పవర్ స్టార్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.'కాటమరాయుడు' రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం. ఇందులో పవన్ ఫ్యాక్షనిస్టు లీడర్ కనిపించబోతున్నాడు. పవన్ కి సోదరులుగా యంగ్ హీరోలు శర్వానంద్, విజయ్ దేవరకొండ లు కనిపించబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ న్యూస్ లో నిజమెంతో తెలియదు. కానీ.. 'కాటమరాయుడు'లో పవన్ చిన్న తమ్ముడిగా కమల్ కామరాజు కనిపించబోతున్నాడు.ఈ విషయాన్ని స్వయంగా కమన్ నే తెలిపారు. కాటమరాయుడులో తనది కీలక పాత్ర, తనకు లవ్ స్టోరి కూడా ఉంటుందని, తన గర్ల్ ఫ్రెండ్ గా మానస నటిస్తోందని తెలిపాడు. ప్రస్తుతానికైతే.. పవన్ చిన తమ్ముడి వివరాలు తెలిశాయి. ఇక, మిగిలిన తమ్ముళ్ల గురించి కూడా తెలియజేస్తే బాగుండునని పవన్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.ఇదిలావుండగా, కాటమరాయుడులో పవన్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది. ఇది అజిత్ 'వీరమ్' చిత్రానికి రిమేక్ గా చెబుతున్నారు. అయితే, కంఫ్లీట్ రిమేక్ కాకుండా మూల కథని మాత్రమే తీసుకొని.. కథని రెడీ చేసినట్టు వినికిడి. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. శరత్ మరార్ నిర్మాత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com