మంచు విష్ణు వరద బాధితులకు సాయం...
- September 25, 2016
హీరో మంచు విష్ణు ప్రస్తుతం 'లక్కున్నోడు' చిత్రం చేస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వరదలో చిక్కుకుపోయిన వారిని ఆదుకోవడానికి షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి సహాయక చర్యలు చేపట్టాడు. హైదరాబాద్‌లోని విష్ణు స్ర్పింగ్ బోర్డు అకాడమీ క్యాంపస్‌లోని 20కి పైగా బ్రాంచీల వారి సహకారంతో బాధితులకు ఆహారం, నీరు, బ్లాంకెట్స్ అందజేస్తున్నారు. అలాగే ఇక్కడ జనరేటర్స్ సహాయంతో స్పెషల్ చార్జింగ్ పాయింట్స్‌ను కూడా పెట్టారు.దీంతో మొబైల్స్, మిగతా ఎలక్ర్టానిక్ పరికరాలను చార్జింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. సహాయం కోసం నిజాంపేట, కె.పి.హెచ్.బి కాలనీ, నాచారం, మియాపూర్‌లలోని స్ప్రింగ్ బోర్డ్ అకాడమీలలో సంప్రదించాలి అని చెప్పారు. శనివారం నుండి మూడు రోజుల వరకు విష్ణు అండ్ టీం ఈ సహాయ కార్యక్రమాలను అందించనున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!







