ఐఎస్‌ వ్యతిరేకంగా జోర్డాన్‌ పోరాడుతోంది...

- September 25, 2016 , by Maagulf
ఐఎస్‌ వ్యతిరేకంగా జోర్డాన్‌ పోరాడుతోంది...

జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌లోని అబిదలీ జిల్లా కోర్టు అవరణలో ఓ రచయిత హత్యకు గురయ్యారు. జోర్డాన్‌కి చెందిన రచయిత నహేద్‌ అత్తార్‌ ఆగస్టు 13న ఫేస్‌ బుక్‌లో ఓ కార్టూన్‌ పోస్టు చేశారు. అది ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ కేసు నమోద చేసి నహేద్‌ను అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలులో ఉన్న నహేద్‌ సెప్టెంబరు మొదటి వారంలో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత ఆయన ఆ కార్టూన్‌ను ఫేస్‌ బుక్‌ నుంచి తొలగించారు. ఆ కేసు విషయంలో కోర్టుకు హాజరైన నహేద్‌ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చిచంపాడు. అతడి శరీరంలోకి మూడు బులెట్లు దూసుకుపోయాయి. హత్యకు గురైన నహేద్‌ క్రైస్తవుడు. జోర్డాన్‌ ప్రభుత్వం నహేద్‌ కేసు విషయమై మీడియా మీద అంక్షలు విధించింది.అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలతో కలిసి ఐఎస్‌ వ్యతిరేకంగా జోర్డాన్‌ పోరాడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com