'ఇజం'లో తారక్ వాయిస్...
- September 25, 2016
పూరీ జగన్నాథ్ - కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇజం'. ఇందులో ఎన్టీఆర్ ఓ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడనే ప్రచారం జరిగింది. త్వరలోనే తారక్ పై సీన్స్ చిత్రీకరిస్తారని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తారక్ 'ఇజం'లో గెస్ట్ రోల్ లో మెరిసేందుకు తిరస్కరించినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. పూరి, కళ్యాణ్ ఎంత కన్విన్స్ చేసినా తారక్ వినలేదట.ఇద్దరం కలిసి నటిస్తున్నప్పుడు సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలుంటాయని.. వాటికి తగ్గ కథలో నటిస్తే బాగుంటుంది. కానీ, చిన్న రోల్లో చేస్తే సినిమాకు ఏం ఉపయోగం ఉండదని తారక్ పూరి, కళ్యాణ్ లని కన్విన్స్ చేసినట్టు తెలుస్తోంది. తారక్ చెప్పింది కూడా నిజమేనని కళ్యాణ్ కామ్ అయిపోయినట్టు తెలుస్తోంది.కాకపోతే, 'ఇజం'లో తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడంట. ఇక, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కలసి నటించే చిత్రం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన కథ దొరికితే.. ఈ నందమూరి మల్టీస్టారర్ పట్టాలెక్క అవకాశాలున్నాయ్. మరి.. నందమూరి మల్టీస్టారర్ ని తయారు చేసే దర్శకుడు ఎవరన్నది చూడాలి. దీంతో సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మాత్రమే తీసుకున్నారని చెబుతున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







