మహిళలకు సంపూర్ణ హక్కుల కోసం పిటిషన్
- September 27, 2016
రియాద్: వేలాది మంది సౌదీలు, గార్డియన్ షిప్ సిస్టమ్‌ని వ్యతిరేకిస్తూ పిటిషన్‌కి మద్దతు పలుకుతున్నారు. గార్డియన్ షిప్ ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా చాలాకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్క్, స్టడీ, మ్యారేజ్ మరియు ట్రావెల్ వంటి విషయాల్లో మహిళలకు పురుషుల నుంచి సమస్యలు తలెత్తుతున్నాయి. కారణం, అన్ని విషయాల్లోనూ పురుషుల సహకారం మహిళలకు తప్పనిసరి కావడం వల్లే. 14,700 మందితో కలిసి పిటిషన్‌ని రాయల్ కోర్ట్‌లో తమ వాదనల్ని వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని యూనివర్సిటీకి రిటైర్డ్ ప్రొఫెసర్ అజిజా అల్ యూసెఫ్ చెప్పారు. మహిళలు వాహనాల్ని నడిపేందుకు కూడా వీలు లేని కఠిన నిబంధనలు సౌదీ అరేబియాలోనే ఉండడం పట్ల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళ చదువుకోవడానికీ, ప్రయాణించడానికీ, ఇతర పనుల కోసం తండ్రి, భర్త లేదా సోదరుడి అనుమతి తీసుకోవాల్సి రావడం విచారకరమని మహిళా ఆందోళనకారులు అంటున్నారు. తండ్రి లేదా భర్త లేదా సోదరుడు విశాల హృదయంతో ఆలోచిస్తే సమస్యలు ఉండవనీ, కానీ అన్ని సందర్భాల్లోనూ అది సాధ్యం కావడంలేదని వారు ఆరోపించారు. సౌదీ అరేబియాలో 10 మిలియన్ మహిళలు ఉన్నట్లుగా ఓ అంచనా చెబుతోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







