హీరో అల్లరి నరేష్ తండ్రి అయ్యాడు...
- September 28, 2016
హీరో అల్లరి నరేష్ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఆనందం వ్యక్తం చేశారు. అందమైన పాపాయికి తండ్రయిన అదృష్టవంతుడిని.. చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. దీంతోపాటు పాపతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దాంతో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.గత ఏడాది మే లో అల్లరి నరేష్.. విరూప కంఠమనేనిని వివాహం చేసుకున్నారు. ఆమె వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన 'సెల్ఫీరాజా' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరేశ్ ప్రస్తుతం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా







