దసరా పండగ కి రైల్వే సిబ్బందికి 78 రోజుల బోనస్..
- September 28, 2016
పండుగ కానుకగా రైల్వే సిబ్బందికి ఈ ఏడాది కూడా 78రోజుల బోనస్ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడి ఉన్న బోనస్(పీఎల్‌బీ) ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. గతేడాది వరకు పీఎల్‌బీపై ఉన్న పరిమితి రూ.3,500 నుంచి రూ.7వేలకు పెరగడంతో.. ఈ ఏడాది ఉద్యోగులకు దాదాపు రూ.18వేల చొప్పున బోనస్ లభించనుంది. ఈ బోనస్‌తో దాదాపు 13లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లాభం చేకూరనుంది. ఈసారి బోనస్‌తో రైల్వేపై దాదాపు రూ.2వేల కోట్ల అదనపు భారం పడనుంది. గత నాలుగేళ్లలోనూ రైల్వే సిబ్బందికి 78రోజుల వేతనాన్ని బోనస్‌గా అందిస్తున్నారు.దసరా పండగ ముందే బోనస్ ఇస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







