దేశంలోని సంపన్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానం...

- September 28, 2016 , by Maagulf
దేశంలోని సంపన్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానం...

దేశంలోని సంపన్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉందట. ఈ సిటీలో ఏడుగురు బిలియనీర్లు ఉన్నట్టు న్యూ వరల్డ్ తాజా నివేదిక పేర్కొంది. అరబిందో ఫార్మా ప్రమోటర్లు నిత్యానంద రెడ్డి, రామచంద్రా రెడ్డి, అమర్ రాజా బ్యాటరీస్ ప్రమోటర్ గల్లా రామచంద్ర నాయుడు, దివీస్ ల్యాబ్స్ అధినేత మురళి దివి, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లో దివంగత అంజిరెడ్డి కుటుంబీకులు, అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సి.ప్రతాప రెడ్డి పేర్లను ఈ నివేదిక ప్రస్తావించింది. మిగిలిన ఇద్దరు బిలియనీర్లు అన్ లిస్టెడ్ గ్రూపులకు చెందినవారట. మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల కన్నా చాలా ఎక్కువ ఉండవచ్చునని వ్భావిస్తున్న రామోజీ గ్రూపులో రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు, ఈటీవీ, కళాంజలి, మార్గదర్శి చిట్ ఫండ్స్, డాల్ఫిన్ హోటల్స్, ఉషాకిరణ్ మూవీస్ వంటివి ఉన్నాయి.రాష్ట్రానికే చెందిన నవయుగ గ్రూపు (సి.విశ్వేశ్వర రావు) సైతం కృష్ణపట్నం పోర్టు తో బాటు వివిధ రంగాల్లో ఉంది. దేశంలో నాలుగో సంపన్న నగరం గా నిలిచిన హైదరాబాద్ లో 8,200 మంది మిలియనీర్లు ఉన్నారని ఈ రిపోర్టు తెలిపింది. ఈ నగరం మొత్తం సంపద సుమారు రూ.20.1 లక్షల కోట్లు (310 బిలియన్ డాలర్లు) గా ఉంది. ఆయా నగరాలల్లోని మొత్తం వ్యక్తుల అప్పులను మినహాయించి వివిధ కంపెనీల్లో వాటాలు, ఇతర ప్రైవేటు ఆస్తులను కలిపి లెక్క వేశారట. కాగా..ఈ లిస్టు ప్రకారం.. దేశంలోని సంపన్న నగరాల విషయానికి వస్తే.. దేశ ఆర్ధిక రాజధాని ముంబై అత్యంత ధనిక నగరంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 4,500 మంది మిలియనీర్లు, 28 మని బిలియనీర్లు ఉన్నారని రిపోర్టు పేర్కొంది. ఈ సిటీ మొత్తం సంపద విలువ దాదాపు 53.3 లక్షల కోట్లు (820 బిలియన్ డాలర్లు) గా లెక్క కట్టారు. ముంబై తరువాత ఢిల్లీ, బెంగుళూరు నగరాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com