తెలుగు స్టార్స్ అంతా అరవ బాట .....
- September 28, 2016
తెలుగు స్టార్స్ దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తెలుగుతో పాటుగా ప్రక్కనున్న బాషల్లోనే రాణించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ ఫోకస్ కోలీవుడ్ పై పడింది. కోలీవుడ్ లోని పలు స్టార్స్ కి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. కానీ, టాలీవుడ్ స్టార్స్ లో కోలీవుడ్ బాక్సాపీస్ ని కొల్లగొట్టే దమ్ము ఎవ్వరికీ లేదు. అయితే, ఇప్పుడిప్పుడే అటు వైపుగా అడుగులు వేస్తున్నారు మన స్టార్స్
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు మురగదాస్ చిత్రంతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ్ లోనూ రిలీజ్ కానుంది. ఈ చిత్రంపై టాలీవుడ్ తో పాటుగా, కోలీవుడ్ లోనూ మాంచి క్రేజ్ ఉంది.స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కోలీవుడ్ ఎంట్రీ కోసం దర్శకుడు లింగుస్వామిని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.కోలీవుడ్ ఎంట్రీపై ఇటీవలే చైన్నై అధికారిక ప్రకటన చేశాడు బన్నీ. బన్నీ-లింగస్వామి చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా ఎప్పటి నుంచో కోలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, వచ్చే యేడాది చెర్రీ మణీరత్నంతో జతకట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మణిరత్నం కార్తీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మణీరత్నం-చరణ్ సినిమా ఉండనుంది.మొత్తానికి తెలుగు స్టార్స్ అంతా అరవ బాట పడుతున్నారు. ఇందుకోసం అరవ దర్శకుల సహాయం తీసుకుంటున్నారు. కోలీవుడ్ ఎంట్రీ అయితే ఇస్తున్నారు. మరీ. వీరిలో కోలీవుడ్ బాక్సాఫీస్ ని ఎందరు కొల్లగొడతారో చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







