మహేష్ జెడ్ స్వీడుతో సినిమాలు చేసేందుకు రెడీ..
- September 28, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు స్వీడు పెంచాడు. వరుసగా సినిమాలని లైన్లో పెట్టేశాడు. ఇక, వచ్చే యేడాది 2017లో ప్రిన్స్ ఏకంగా మూడు సినిమాలని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు మురగదాస్ సినిమాతో బిజిగా ఉన్నాడు. ఈ చిత్రం మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. ఇప్పటికే 40శాతం పైగా షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రాన్ని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ చిత్రం తర్వాత మహేష్ మళ్లీ దర్శకుడు కొరటాల శివతో జతకట్టనున్నాడు. ఇప్పటికే 'శ్రీమంతుడు' మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కొరటాల. ఇప్పుడు మహేష్ కోసం మరో అద్భుతమైన కథని రెడీ చేశాడట.ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. కొరటాల చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి చిత్రంలో మహేష్ నటించనున్నాడు. వంశీ చిత్రాన్ని కూడా ప్రిబ్రవరి లేదా మార్చిలో మొదలెట్టేందుకు మహేష్ రెడీ అవుతున్నట్టు సమాచారమ్.
మురగదాస్, కొరటాల, వంశీ పైడిపల్లి లతో చేయబోయే సినిమాలని 2017 రిలీజ్ చేసిందుకు ప్రిన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిగాక, పూరి చిత్రాన్ని కూడా ఇదే యేదాది పట్టాలెక్కించనున్నాడు. మొత్తానికి మహేష్ జెడ్ స్వీడుతో సినిమాలు చేసేందుకు రెడీ అయినట్టు కనబడుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







