భారత్ దాడులకు మద్దతిచ్చిన బలూచ్ అధికారి.
- September 29, 2016
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలు సరైనవే అని, భారత్‌కు బలూచిస్థాన్ మద్దతుగా ఉంటుందని బలూచ్ నేత మజ్దక్ దిల్షాద్ బలూచ్ వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్ సరిహద్దు వెంబడి ఉగ్రస్థావరాలపై దాడులు జరపడంపై ఆయన మద్దతు ప్రకటించారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్‌కు స్వతంత్య్రం కావాలని అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి భారత ప్రభుత్వం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత సైన్యం ఈ తరహా లక్షిత దాడులను పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోనూ నిర్వహించాలని మజ్దక్ పేర్కొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా బలూచ్ యూనిటీ ఫోరం మద్దతుదారులు దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. నేడు భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై లక్షిత దాడులు చేసినట్లు ప్రకటించడంతో బలూచ్ నేత మజ్దక్ భారత్‌కు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







