సౌదీ అరేబియా లో ఆంధ్ర వాసి ఆత్మహత్య
- September 29, 2016
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన ఓ మహిళ...అక్కడ పెట్టే చిత్రహింసలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం నీరుగుట్టవారిపల్లికి చెందిన రామిశెట్టి మంజునాథ, హేమలత(29) దంపతులకు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలున్నారు. చేనేత కార్మికులుగా వారికి చాలీచాలని కూలి లభిస్తుండటంతో మరింత మెరుగైన జీవనోపాధి కోసం హేమలత ఈ ఏడాది ఏప్రిల్ లో సౌదీ అరేబియా వెళ్లింది. అక్కడ రియాద్ నగరంలో ఓ ఇంట్లో పనికి కుదిరింది. అయితే, ఆ ఇంటి యజమాని ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు. వాటిని తట్టుకోలేక ఆమె తరచూ ఇంటికి ఫోన్ చేసి భర్తతో తన గోడు వెళ్లబోసుకునేది. అక్కడ యజమాని ప్రత్యక్ష నరకం చూపుతున్నాడని వాపోయేది.
తిరిగి స్వదేశం చేరాలనుకున్నా.. ఆమెను అక్కడికి తీసుకెళ్లిన ఏజెంట్ మోసం చేశాడు. ఈ నేపథ్యంలోనే గురువారం తను ఉండే చోటే ఉరి వేసుకుని తనువు చాలించింది. ఇదిలా ఉండగా, ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలంటే కనీసం రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని అక్కడి నుంచి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఒకవేళ డబ్బులు చెల్లించినా మృతదేహం స్వదేశం చేరుకునేందుకు కనీసం మూడు నెలలు పడుతుందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక భర్త, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







