భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను ఐక్యరాజసమితి నిశితంగా గమనిస్తోంది
- September 30, 2016
'ఉరీ ఉగ్రదాడి' అనంతరం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఐక్యరాజసమితి మిలటరీ విభాగం నిశితంగా గమనిస్తోంది. భారత్ జరిపిన లక్షిత దాడుల నేపథ్యంలో భారత్-పాక్ నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులపై ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ దృష్టి సారించినట్లు ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ తెలిపారు. భారత్-పాక్ పరిస్థితులపై ఐరాసలో ఉన్న మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ (యూఎన్‌ఎంవోజీఐపీ) ప్రస్తుత పరిస్థితులపై నివేదిక తెప్పించుకుంటోందని ఆయన చెప్పారు. సరిహద్దులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాలు సమస్యను శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని డుజరిక్ సూచించారు.దీనిపై రెండు ప్రభుత్వాలు పరస్పరం ఒక అవగాహనకు రావాలని కోరారు.
1949 జనవరి 24న యూఎన్‌ఎంవోజీఐపీ ఏర్పడింది. భారత్-పాక్ మధ్య సరిహద్దు వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని తద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం దీనిలో స్వీడన్‌కు చెందిన మేజర్ జనరల్ పెర్ గుస్తాఫ్ లోదిన్ ఆధ్వర్యంలో 10 దేశాలకు చెందిన 41 మంది అబ్జర్వర్లు ఉన్నారు.
తాజా వార్తలు
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!







