తీవ్రవాద చర్యలకు పాల్పడ్డ ఇరువురు బహ్రేయినీలకు పదేళ్ల జైలుశిక్ష
- September 30, 2016
మనామా: ఇరువురు బహ్రేయినీ తీవ్రవాద అనుమానితులకు పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ ఉన్నత నేర న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించింది. అంతేకాక వారి బహ్రేయినీ పౌరసత్వంను రద్దు చేస్తున్నట్లు తీవ్రవాద నేరాల ప్రాసిక్యూషన్ ముఖ్య ప్రాసిక్యూటర్ ఇసా అల్ రోవై'ఏ చెప్పారు.మొదటి నిందితుడు రెండవ నిందితుడిని ప్రభావితం చేయడం ద్వారా వీరు ఇరువురు ఇరాన్ ప్రయాణమై అక్కడ తీవ్రవాద శిక్షణ తీసుకొన్నారు. ప్రజల భద్రత, ప్రభుత్వ మరియు ప్రైవేట్ వ్యక్తుల సంస్థాపనలు వ్యతిరేకంగా తీవ్రవాద దాడులు చేయడమే లక్ష్యంగా కుట్రపూరిత ఉద్దేశ్యంతో వీరు విద్రోహచర్యలకు పాల్పడుతూ ,ఆయుధాలు మరియు ప్రేలుడు పదార్థాలను ఉపయోగించడంలో సైతం నైపుణ్యం పొందారు. ఇప్పటికీ బహ్రేయినీ రాజ్యంలో భద్రత మరియు స్థిరత్వం అస్థిరపర్చేందుకు వారికి బాధ్యత అప్పగించబడింది.ఈ కేసులో పలు పరిశోధనలను నిర్వహించిన అనంతరం వారి ఇరువురిపై చట్టపరమైన అరెస్ట్ వారెంట్లు జారీ చేసి నిర్బంధించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







