పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది...
- September 30, 2016
ఓవైపు నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు చేపట్టిన దాడుల నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా .. మరోవైపు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. గడిచిన 48 గంటల్లో ఐదోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ బలగాలు.. భారత సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. అఖ్నూర్ సెక్టార్‌లోని చప్రియల్, సమ్వాన్ ప్రాంతాల్లో పాక్ బలగాలు శుక్రవారం ఉదయం కాల్పులు జరిపాయి.దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు.. పాక్ బలగాలకు ధీటుగా సమాధానమిచ్చారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని జమ్ము డిప్యూటీ కమిషనర్ సిమ్రన్దీప్ సింగ్ తెలిపారు.సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దాదాపు వెయ్యి గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







