తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న నల్గురు విదేశీయులు ఒక సౌదీ వ్యక్తి అరెస్టు
- September 30, 2016
జెడ్డా : నల్గురు విదేశీయులు ఒక సౌదీ వ్యక్తి తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు కింగ్డమ్ లో వీరు తీవ్రవాద గ్రూపులతో కల్సి తీవ్రవాద కార్యకలాపాల నిర్వహణకు కేయాయించబడ్డారు. ఈ ఐదుగురిని ఈ వారంలో అరెస్టు చేశారు వీరిలో ఇరువురు సిరియన్లు, ఒకరు కింగ్డమ్ చెందిన వ్యక్తి కాగా ,ఒకరు భారతీయుడు మరొకరు పాకిస్తానీ నివాస కాగా వీరందరూ సౌదీలో నివసిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఐదుగురిని ప్రజా భద్రతా జైళ్లు మరియు పరిశోధనల నిమిత్తం అదుపులోకి తీసుకొన్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఆగస్టు 2009 నుంచి 19 మంది భారతీయులను అరెస్టు చేశారు. మొదటి వ్యక్తి తీవ్రవాదులు తో సంబంధాలు కల్గి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేయబడి ఆనాటి నుండి ఇప్పుడు వరకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఉంది. మిగిలిన 18 మంది భారతీయులను అదుపులోకి తీసుకొని వారిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా 51 మందికి తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో వీరిని 2003 నుంచి అరెస్టు చేశారు. పాకిస్థానీయులు ఈ అరెస్టులపై ఆందోళన చెందుతున్నారు వారిలో కొందరు ఇప్పటికే జైలు జీవితాన్ని గడుపుతూ తమ తమ గడువు కాలం పూర్తి చేయనున్నారు. వీరిపై సైతం విచారణ కొనసాగుతూ ఉంది. 2004 నుండి, 182 సిరియన్ లను తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న కేసులో అరెస్టు చేశారు. వారిపై చాలా కాలం నుండి పోలీసుల పరిశోధన జరుగుతోంది.ఇప్పటివరకు, 5,277 మంది ప్రజా భద్రతా జైళ్లలో ఖైదీలుగా కొనసాగుతున్నారని సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







