నవాజ్ షరీఫ్ శాంతి మంత్రం....
- September 30, 2016
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ శాంతి మంత్రం వల్లించారు. 'ఇస్లామాబాద్ శాంతిని కోరుకుంటోంది. అయితే పాకిస్తాన్‌కు ఎవరు కీడు తలపెట్టినా వారి ఆటలు సాగనీయం' అని నవాజ్ శుక్రవారంనాడు అన్నారు. జమ్మూకశ్మీర్, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పరిస్థితిని తన మంత్రివర్గ సహచరులతో సమీక్షించిన సందర్భంగా నవాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు రేడియా పాకిస్థాన్ పేర్కొంది. అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తున్న పాక్ శాంతిని కోరుకుంటోందని, అయితే మాతృభూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క పాకిస్తానీ కంకణబద్ధులై ఉంటారని అన్నారు. దేశం యావత్తూ సైనిక బలగాలకు అండగా నిలుస్తుందన్నారు. దేశ ఆర్థిక ప్రగతి, పేదరికం, నిరుద్యోగితపై పోరాటానికి పాకిస్తాన్ శాంతిని కోరుకుంటున్నట్టు నవాజ్ తెలిపారు.
ఎల్ఓసీ వెంబడి టెర్రరిస్టు శిబిరాలపై లక్షిత (సర్జికల్) దాడులు జరిపినట్టు భారత్ ప్రకటించిన నేపథ్యంలో నవాజ్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







