'మజ్ను' విజయోత్సవ యాత్ర
- September 30, 2016
విశాఖ నగరంలో 'మజ్ను' చిత్ర యూనిట్ సందడి చేసింది. నాని కథానాయకుడిగా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మజ్ను' హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో ఉత్సాహంగా ఉన్న చిత్ర బృందం విశాఖ నుంచి విజయోత్సవ యాత్ర ప్రారంభించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. 'మజ్ను' చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ తనకు సెంటిమెంట్ ప్రదేశమని.. తన అన్ని చిత్రాల విజయోత్సవ యాత్రలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్ర విశాఖలో ప్రారంభమై రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు.
ఈ ఏడాది 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' 'జెంటిల్‌మెన్' చిత్రాల ద్వారా విజయాలను అందుకున్న నాని 'మజ్ను'తో హ్యాట్రిక్ కొట్టాడు. 'ఉయ్యాల జంపాల' లాంటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను తెరకెక్కించిన విరంచి వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. నాని సరసన ఇమ్మాన్యుయేల్, ప్రియాశ్రీ హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







