'ఒప్పం' రీమేక్‌లో నాగార్జున...
- September 30, 2016
అక్కినేని నాగార్జున... యువసామ్రాట్. రొమాంటిక్, యాక్షన్ హీరోగా సినిమాలు చేస్తూనే తన కెరీర్‌కు భిన్నంగా అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రాల్లో నటించి ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించిన హీరో. ఇంకా చెప్పాలంటే రొటీన్‌కు భిన్నంగా వుండే నాగ్, కాస్త వెరయిటీ రోల్స్‌లో కనిపించే ప్రయత్నం చేస్తుంటాడు.
హీరో ఇమేజ్ చట్రంలో నుంచి బయటకొచ్చి ఊపిరిలో వీల్ చెయిర్‌కు పరిమితమైన పాత్రలో మెప్పించి హిట్ కొట్టాడు. తన మూవీల్లో కొత్తదనం కోసం తపించే ఈ హీరో ఇప్పుడు మరో ఎక్స్పెర్మెంట్కు రెడీ అవుతున్నాడట.రీసెంట్ మూవీలతో తెలుగులో మంచి స్కోప్ ఏర్పచుకున్న మోహన్‌లాల్.. ఇక నుండి టాలీవుడ్ మార్కెట్‌పై కాన్సంట్రేట్ చేస్తున్నాడట.
మాలీవుడ్‌లో ప్రియదర్శన్ రామ్ డైరెక్షన్లో మోహన్‌లాల్ నటించిన సినిమా 'ఒప్పం'. రిలీజయిన మూడు వారాల్లో టాప్ కలెక్షన్లు సాధించి సూపర్‌హిట్‌గా నిలిచిన ఆ మూవీని తెలుగు రీమేక్‌లో నాగార్జునతో చేయించాలని ప్లాన్‌లో ఉన్నారని ఇన్సైడ్ టాక్.
అందులో మోహన్‌లాల్ కళ్లులేని వాడిగా నటించాడు. ఓ లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేసే తను అపార్ట్మెంట్లో హత్య చేసిన కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడనేదే కథ. ఇందులో మోహన్‌లాల్ బ్లైండ్మ్యాన్గా నటించి మెప్పించాడు. అయితే ఈ క్యారెక్టర్ చేయడానికి నాగ్ సాహసం చేస్తాడా? అనేదే డౌట్. నాగార్జున ఒప్పుకుంటే ఒప్పం తెలుగు రీమేక్ చేసేద్దామనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్







