రోడ్ ప్రాజెక్టులతో మెరుగైన రవాణా
- September 30, 2016
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - ట్రాఫిక్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, దోహాలో పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్)తో కలిసి పలు ప్రాజెక్టుల్ని వాహనదారుల కోసం చేపడ్తోంది. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్యల నుంచి వాహనదారులకు ఊరట లభిస్తోంది. ఈ విషయమై ట్రాఫిక్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ మరాఫి మాట్లాడుతూ, మోటరిస్టులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించగలుగుతున్నామనీ, అలాగే నడిచి వెళ్ళేవారికి కూడా ఎంతో మేలు చేస్తున్నామని అన్నారు. కొత్త రోడ్లు, బ్రిడ్జ్‌లు వాహనాలు స్మూత్‌గా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తాయనీ, ట్రాఫిక్ సమస్యలకు తావే ఉండదని ఆయన తెలిపారు. కొత్త రోడ్లపైకి ఎంట్రీ, ఎగ్జిట్లను చాలా అద్భుతంగా డిజైన్ చేయించడం వల్ల వాహనదారులు కొత్త ప్రాజెక్టుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తమకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వివరించారాయన. షమాల్ రోడ్‌పై 19 ఇంటర్ ఛేజ్‌లను ప్లాన్ చేశారు. జంక్షన్ 5 వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ ఛేంజ్ దుహైల్ స్ట్రీట్‌ని దోహా రూట్లో కనెక్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







