కావేరి జలాలు విడుదల చేయండి: సుప్రీంకోర్టు
- September 30, 2016
తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేసేది లేదని కర్ణాటక తేల్చిచెప్పడంతో.. చివరి అస్త్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేరకు కావేరి ట్రిబ్యునల్ ఏర్పాటు కాబోతోంది. కావేరి జలవివాద పరిష్కారానికి ఈనెల 4వ తేదీలోగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వుల పట్ల రాష్ట్రంలోని డెల్టా రైతు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హర్షం ప్రకటించారు.కేంద్ర నీటివనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన గురువారం ఢిల్లీలో జరిగిన తమిళనాడు, కర్ణాటక ద్వైపాక్షిక సమావేశంలో రాజీ కుదరలేదు. కావేరి నుంచి చుక్కనీటిని సైతం విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తేల్చి చెప్పేశారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కావేరి జలాల విడుదలకు ఇక ట్రిబ్యునల్ ఏర్పాటే శరణ్యమని తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.తమ ఉత్తర్వులను ఉల్లఘించడం తగదంటూ కర్ణాటక ప్రభుత్వానికి తుది హెచ్చరికను జారీ చేస్తున్నామంటూ పేర్కొంది. ఇక కావేరి జలాల విడుదలకు ట్రిబ్యునల్ ఏర్పాటే మంచిదని అభిప్రాయానికి వచ్చిన సుప్రీంకోర్టు ఈనెల 4వ తేదీలోగా ఆ సంస్థను ఏర్పాటు చేయవలసిందంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ సమన్వయకర్తగా వ్యవహరించేందుకు సమర్థవంతమైన అధికారి పేరును శుక్రవారం సాయంత్రంలోగా సూచించమని పేర్కొంది. అదే విధంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి తరఫున ట్రిబ్యునల్ సభ్యులుగా నియమించేందుకు అధికారుల పేర్లను శనివారం సాయంత్రం 5 గంటలలోగా తమకు తెలపాలని ఆదేశించింది.అంతేకాకుండా శనివారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు సెకనుకు ఆరువేల ఘనపుటడుగుల చొప్పున కావేరి జలాలను ఖచ్చితంగా విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ ఏర్పాటుకే కాకుండా, తక్షణమే జలాల విడుదలకు ఉత్తర్వులివ్వడం పట్ల డెల్టా రైతులు హర్షం ప్రకటించారు. సీపీఐ నాయకుడు ముత్తరసన్ సహా పలువురు రాజకీయ నేతలు సైతం సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









