పాఠశాల బస్సు ప్రమాదంలో గాయపడిన 38 మంది ఆసుపత్రి నుంచి విడుదల
- September 30, 2016
అబూధాబీ : గత గురువారం ఉదయం అబూధాబీ లో ఒక ప్రధాన రోడ్డులో మూడు బస్సుల ప్రమాదంలో గాయపడిన 38 మంది విద్యార్థులు, 9 మంది ఇతరులు చికిత్స అనంతరం మఫ్రాక్ ఆసుపత్రి నుంచి విడుదల కాబడినట్లు అబూధాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహ ) ప్రకటించింది.రెండు పాఠశాల బస్సులు మరియు ఒక పబ్లిక్ రవాణా బస్సు అబూధాబీ లో ముస్సాఫ్ఫాహ్ వంతెన తర్వాత.ఖలీజ్ అల్ ముస్లిం విద్యా కేంద్రం అరబీ రోడ్డుపై "ఢీ" కొన్నప్పుడు నలభై ఏడు మందిలో అత్యధికమంది పిల్లలు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురిని మెరుగైన చికిత్స కోసం మఫ్రాక్ హాస్పిటల్ మరియు షేక్ ఖలీఫా మెడికల్ సిటీ ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందించినట్లు ఎమర్జెన్సీకి సంసిద్ధత డైరెక్టర్ డాక్టర్ మార్వాన్ అల్ కాబి తెలిపారు. ఇరవై ఐదు మందికి స్వల్ప గాయాలు కాగా, మరో 20 మందికి మోస్తరు గాయాలయ్యాయని మరియు ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయని మఫ్రాక్ హాస్పిటల్ సిఇఓ మహ్మద్ అబ్దుల్లా అల్ దహెరి చెప్పారు. గాయపడిన తొమ్మిది మందిలో ఏడుగురికి స్వల్పంగా ఎముకలు విరగ్గా ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. మరో ఇరువురిని ఇంటెన్సివ్ కేర్ లో ఇప్పుడు ఉంటూనే దవడ మరియు తొడ గాయాలకు శస్త్రచికిత్సలు జరిగేయి. తమ వైద్య సిబ్బంది ఈ కేసులను అత్యంత వృత్తి నైపుణ్యంతో అత్యవసర పద్ధతిలో నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







