'యు' ధ్రువీకరణ పత్రం పొందిన 'దేవి'
- September 30, 2016
ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన చిత్రం 'దేవి'. 'మదరాసపట్టిణం', 'తలైవా' వంటి సినిమాలను రూపొందించిన విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం ఈ సినిమా సెన్సార్‌కు వెళ్లొచ్చింది. దీనిని చూసిన అధికారులు 'యు' ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇదిలా ఉండగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల ఏడో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కె.గణేశ్ నిర్మించిన ఈ సినిమాలో సోనూసూద్ ముఖ్యపాత్ర పోషించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. ఇదిలా ఉండగా శివకార్తికేయన్ నటించిన 'రెమో' సినిమా కూడా ఏడో తేదీన తెరపైకి రానుంది.అలాగే విజయ్‌సేతుపతి నటించిన 'రెక్క' చిత్రం కూడా అదే రోజున అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







