వృద్ధులకోసం వీలుగా ఇ-సర్వీసులు
- September 30, 2016
షార్జా: షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇ-గవర్నమెంట్ (డిఎజి), సీనియర్ సిటిజన్స్‌కి ప్రత్యేక అవసరాలు ఉంటాయని గుర్తించి, వారికి వీలుగా డిజిటల్ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తోంది. ఎల్డర్లీ సర్వీసెస్ ఫోరం 2016 ఐదవ ఎడిషన్ కార్యక్రమంలో 'ది కరెంట్ అండ్ ఫ్యూచర్ సర్వీసెస్ ఫర్ ఎల్డర్లీ బై షార్జా సిటీ ఎన్‌టైటీస్' పేరుతో జరిగిన సెషన్లో, డిఇజి ఈ అంశాన్ని ప్రస్తావించింది. షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సర్వీస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో కలిసి ఈ ఫోరంని నిర్వహించారు. వృద్ధుల కోసం ఇ-సర్వీసుల్ని అదనంగా, ప్రత్యేకంగా వివిధ విభాగాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిఇజి అభిప్రాయపడింది. డిఇజి డైరెక్టర్ జనరల్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి మాట్లాడుతూ, సొసైటీలో వృద్ధుల్ని ప్రత్యేక కేటగిరీగా భావించి వారికి ప్రత్యేక సేవల్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ ఏజెన్సీలు, ఫోరంలో వెల్లడయిన అభిప్రాయాలతో ఏకీభవించి, వృద్ధులకు మేలైన సర్వీసులు అందించేందుకు ముందుకొస్తామని వెల్లడించాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









