బ్రెజిల్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ..
- September 30, 2016
బ్రెజిల్‌లోని అతిపెద్ద నగర మైన సావో పౌలోలోని జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారయ్యరు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఉదయం వేళల్లో హాజరుకు పిలిచినప్పుడు కొంత మంది ఖైదీలు జైలు గదులకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనతో చెలరేగిన అలజడిలో 200 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. 13 అడుగుల ఎత్తైన గోడను దూకి సమీపంలోని నదీతీరం వెంబడి అదేవిధంగా చెరకు పంట పొలాల నుండి ఖైదీలు పారిపోయారు. పారిపోయిన ఖైదీల్లో సగం మందిని పోలీసు అధికారులు గంటలు తిరగకుండానే పట్టుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వెయ్యి మంది ఖైదీలు ఉండేట్టు ఈ జైలును నిర్మించారు. ప్రస్తుతం ఇందులో 1800 మంది ఖైదీలు ఉన్నట్టు సమాచారం.ఖైదీల హక్కులను కాలరాస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. బ్రెజిల్లో జైలు నుంచి ఖైదీలు పారిపోవడం చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాగా ఖైదీల పరారీ సందర్భంగా ఎటువంటి నష్టం(గార్డ్స్ లేదా ఖైదీలు మరణించడం, గాయపడటం) జరిగింది. ఇప్పటికైతే తెలియరాలేదు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







