ఉమ్ అల్ కువైన్ లో 'బంగారు బతుకమ్మ' వేడుకలు

- October 02, 2016 , by Maagulf

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తేది 30 సెప్టెంబర్ 2016  శుక్రవారం రోజన UAE  లోని ఏడు ఎమిరేట్స్ లోని ఒకటయిన ఉమ్ అల్ కువైన్ లోని ఇండియన్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్  ప్రాంగణం లో సాయంత్రం 5 గంటల నుండి 9.30 గంటల వరకు ఘనంగా బంగారు బతుకమ్మ సంబరాలు 
యూఏఈ లోని దుబాయ్ , షార్జా , అజ్మాన్ , ఉమ్ అల్ కువైన్, రస్ ఆల్ ఖైమా, అబుదాబి , ఫుజైరా , అలైన్ ప్రాంతాలలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు  సుమారు 3500 మంది హాజరు , పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , కేరళ , తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాలనుండి కూడ ప్రజలు కూడ బతుకమ్మ సంబరాల్లో హాజరు అవడం విశేషం 
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ లోకసభ సభ్యులు,తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు మరియు అద్యక్ష్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు , మరియు లోకల్ గెస్ట్స్ గా ఇండియన్ కాన్సులెట్ దుబాయ్ నుండి దీప జైన్ (కౌన్సిల్ కల్చరల్ ) , ఉమల్ కోయిన్ ఇండియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బషీర్ గారు , యూఏఈ తెలంగాణ జాగృతి మరియు ETCA అద్యక్ష్యులు పీచర కిరణ్ కుమార్ , ఉపాధ్యక్ష్యులు మంచుకొండ వెంకటేశ్వర్లు, తోట రామ్ కుమార్ , సత్యం రాధారపు , అనురాధ ఒబ్బిలిశెట్టి  , శ్రీకాంత్ చిత్తర్వు , రిషిత అతిథులుగా హాజరయ్యారు .  
ఉదయం ఏడు గంటలకు దుబాయ్ టర్మినల్ 3 లో  శ్రీమతి కవిత గారికి యూఏఈ జాగృతి విభాగం మరియు  ETCA సభ్యులు  ఘన స్వాగతం పలికారు 
11 గంటలకు షార్జా లోని ఆల్ ఖాన్  ప్రాంతంలోని ETCA సభ్యులు శ్రీ సత్యం రాధారపు నివాసంలో బతుకమ్మ మేకింగ్  కార్యక్రమంలో శ్రీమతి  కవిత గారు పాల్గొని మహిళతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ పేర్చారు. ఈ కార్యక్రమంలో    ETCA మహిళ విభాగ సభ్యులు పాల్గొన్నారు. 
5.30 నుండి 7 గంటల వరకు ఇండియన్ అసోసియేషన్ వెలుపల బతుకమ్మలను తీసుకొని వచ్చిన మహిళలలకు కళాకారులు స్వాగతం పలికారు ,కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా విచ్చేసిన  గాయకులు కోకిల నాగరాజు గారు బతుకమ్మ పాటలు పాడగా హాజరయిన మహిళలు బతుకమ్మ ఆడుతూ కార్యక్రమాన్ని కనువిందు చేసారు.   
సాయంత్రం 7.15 నిమిషాలకు భారీ జన సమ్మేళనం నడుమ , కళాకారుల చప్పుడప్పుళ్ళ తో ముఖ్యఅతిథికి, బతుకమ్మలతో విచ్చేసిన ఆడపడుచులకు ఇండియన్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లోకి  ఘన స్వాగతం పలికారు 
బతుకమ్మ ను నెత్తిన ఎత్తుకొని కార్యక్రమ వేదికనుండి శ్రీమతి కవిత గారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపి , గౌరీ పూజతో బతుకమ్మ ఆటను ప్రారంభించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో , చిత్తు చిత్తుల బొమ్మ మొదలైన పాటలకు మహిళల చప్పట్ల తో కార్యక్రమ ప్రాంగణం మారు మ్రోగింది . తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు - అందులో భాగంగా ETCA మహిళా విభాగంచే కోలాటాలు, అందమైన బతుకమ్మల పోటి, ఆడపడుచుల కోసం బతుకమ్మ పాటల పోటి, బాలికల  కోసం సాంప్రదాయమైన వస్త్రాలంకరణ కార్యక్రమాలు హాజరయిన  నిర్వహించి శ్రీమతి కవిత గారి చేతుల మీదుగా బహుమతులు అందచేశారు . 
ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలలో మొదటి రోజును గల్ఫ్ బిడ్డలతో జరుపు కోవడం ఆనందం ఇచ్చిందని, బతుకమ్మ పండుగ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వివిధ  దేశాల్లో  సంబరాలు నిర్వహించడం చాల గొప్ప విషయమని, ఆత్మీయ అనుబంధాలను పెంపొందిస్తూ మనుష్యుల మధ్య దూరాన్ని తగ్గిస్తూ , ప్రకృతి ప్రసాదించిన పుష్పలతో మన చేతుల మీదుగా ఆ గౌరమ్మ బతుకమ్మ రూపంలో ఏర్పడుతుందని , ఆర్ధిక ఇబ్బందులతో, వివిధ కారణాలతో గల్ఫ్ బాట పడుతున్న బిడ్డల కష్టాలు తీరాలని , భవిష్యత్ లో గల్ఫ్ వచ్చినవాళ్లు తెలంగాణ అభివృద్ధి చెందిన తరువాత అక్కడే ఉపాధి దొరికి భార్య పిల్లలతో నివసించే సమయం రావాలని బతుకమ్మను ప్రార్థిస్తున్నామన్నారు. 2 ఏండ్ల కాలంలో NRI సెల్ ద్వార సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. 
గల్ఫ్ దేశాల్లో జాగృతి  ద్వార పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని , యూఏఈ జాగృతి ద్వార వీలయినన్ని కార్యక్రమాలు చేపడుతామని , యూఏఈ జాగృతి శాఖ అద్యక్ష్యులుగా కిరణ్ కుమార్ పీచర గారికి బాధ్యతలు అప్పగిస్తున్నాని , కమిటీ సభ్యులుగా సత్యనారాయణ గాంధారి , సత్యం రాధారపు , అరవింద్ రాగం , శేఖర్ రెడ్డి , దీపిక ఎలిగేటి , శ్రీదేవి మంచుకొండ తదితరులను ప్రకటించారు . 
బతుకమ్మ నిమర్జణం అనంతరం నిర్వాహకులు హాజరయిన ప్రతి ఒక్కరికి జాగృతి బతుకమ్మ ప్రసాదం (పులిహార , సత్తుపిండి )పంపిణీ చేశారు. 
మీడియా పార్టనర్స్ గా ప్రముఖ తెలుగు చానళ్ళు T News, TV 5, V6,  మరియు లోకల్ మీడియా పార్టనర్స్ గా  మాగల్ఫ్ . కామ్  సహకరించినట్టు   న్యూస్ టుడే కు తెలియచేసారు. 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com