విదూడలైన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఫస్ట్ లుక్
- October 02, 2016
ఒకప్పుడు విలన్లు హీరోలుగా మారారు. ఇప్పుడు హాస్యనటులు కథానాయకులుగా మారి రాణిస్తున్నారు. తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన హాస్యనటుడు సప్తగిరి తాజాగా కథానాయకుడి అవతారం ఎత్తబోతున్నారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్ పతాకంపై రవి కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఆదివారం దర్శకుడు మేర్లపాక గాంధీ విడుదల చేశారు. తమిళ చిత్రం 'తిరుడన్ పోలీస్' తనకు బాగా నచ్చిందని, ఆ మూలకథని తీసుకుని స్క్రిప్ట్ తానే రాసుకొన్నానని, ఈ కథకు దర్శకుడు అరుణ్ చక్కటి న్యాయం చేశారని సప్తగిరి అన్నారు. అలీ, పోసాని, షాయాజీషిడే, అజయ్‌ఘోష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుల్గనిన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







