చైనా భద్రతా విభాగాల్లో రోబోలు..!!
- October 02, 2016
కీలకమైన విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించి, అప్రమత్తం చేసే మేధస్సు ఉన్న పది రోబోలను చైనా ఆదివారం విధుల్లోకి ప్రవేశపెట్టింది. ముఖకవళికల సాంకేతిక పరిజ్ఞానం (ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ) ఆధారంగా రోబోలు అనుమానితులను గుర్తిస్తాయని కస్టమ్స్ అధికారి ఝావో మిన్ తెలిపారు. దక్షిణ గాంగ్‌డాంగ్ రాష్ట్రంలోని విమానాశ్రయంలో ఝుహాయి, ఝాంగ్‌షాన్ నగరాల్లోని గాంగ్బెయి, హెంగ్వి్కన్ నౌకాశ్రయాల్లో ఇవి ఆదివారం విధులు నిర్వర్తించాయి.
గ్జియోహాయ్గా నామకరణం చేసిన ఈ మరమనుషులు తమంతట తాముగా వినడం, మాట్లాడటం, కొత్తకొత్త విషయాలు నేర్చుకోవడం, చూడటం, నడవడం చేయగలవని చైనా వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. వీటిలో అమర్చిన ప్రత్యేకమైన డేటాబేస్ ఆధారంగా కాంటనీస్, మాండరిన్, ఇంగ్లిష్, జాపనీస్ తదితర 28 భాషలు, యాసల్లోనూ సమాధానం ఇవ్వగలవు. రోబోలు భద్రతా విధులు నిర్వర్తిస్తుండగా డ్రోన్లు ట్రాఫిక్‌ను పర్యవేక్షించే బాధ్యతలు తీసుకున్నాయి. జాతీయ దినోత్సవం సందర్భంగా చైనాలో శనివారం నుంచి వారంపాటు సెలవులు ప్రకటించారు. దీంతో సరదాగా గడపడానికి లక్షలకొద్దీ జనం రోడ్డు, రైలు, ఆకాశమార్గాన ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ ట్రాఫిక్ని పర్యవేక్షించడానికి అక్కడి అధికారులు డ్రోన్లను మోహరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







