క్యాన్సర్ ను తగ్గించే వివిధ రకాల జ్యూస్ లు...
- October 02, 2016
వివిధ రకాల జ్యూస్ లు క్యాన్సర్ వ్యాధితో పోరాడతాయని మీకు తెలుసా? తెలియదా? అయితే ఇక్కడ తెలిపిన జ్యూస్ ల గురించి మీకు తప్పక తెలుసుకోవాల్సిందే.
1
కూరగాయా జ్యూస్ లు
యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వ్యాధిని నివారిస్తాయని కనుగొనబడింది. కూరగాయలు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయని "డైటెటిక్స్-మాక్స్ హెల్త్కేర్" అధిపతి అయినట్టి 'డాక్టర్. రితికా సమద్దర్' మరియు "అర్తెమిస్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్" అయినట్టి 'డాక్టర్. జ్యోతి అరోరా' తెలిపారు. కావున వివిధ రంగులలో ఉండే కూరగాయల నుండి తయారు చేసిన జ్యూస్ లను తాగి, రోగ నిరోధక వ్యవస్థను బలపరచుకోవటం ద్వారా వివిధ రకాల క్యాన్సర్ వ్యాధి తీవ్రతలను తగ్గించుకోవచ్చని ఇరువురు తెలిపారు.
క్యాన్సర్ ను తగ్గించే బీట్రూట్
చికిత్సాపరమైన లక్షణాలను కలిగి ఉండే బీట్రూట్ జ్యూస్ తో ల్యూకేమియా క్యాన్సర్ ను తగ్గించవచ్చు. వీటిలో ఉండే ఉత్తమ కెరోటినాయిడ్ లు, అన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల పెరుగుదలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బీట్రూట్ జ్యూస్ చాలా చిక్కగా ఉంటుంది కావున క్యారెట్ లేదా ఆపిల్ జ్యూస్ లను కలుపుకొని కూడా తాగవచ్చు.
బ్రోకలీ జ్యూస్
బ్రోకలీలో ఇండోల్-౩ కార్బినోల్ అనే యాంటీ ఆక్సిడెంట్, ఈస్ట్రోజన్ ను విచ్చిన్నపరచి, రోగనిరోధక శక్తిని పెంచి, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ వ్యాధి తీవ్రతలను తగ్గిస్తుంది. పైన గట్టిగా ఉండే పసుపు రంగు లోపించిన బ్రోకలీని కొనుగోలు చేయండి.
క్యారెట్
వైద్యపరంగా, క్యారెట్ జ్యూస్ ను నయం చేసే మరియు గొప్ప గుణాలు కలిగిన రసంగా పరిగణిస్తారు. బీటా-కెరోటిన్ లను కలిగి ఉండే ఈ రసం సహజంగా చర్మ క్యాన్సర్, మెలనోమా వంటి క్యాన్సర్ రకాలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వేర్లు, పగుళ్ళు మరియు శాఖలు లేని క్యారెట్ లను కొనుగోలు చేయండి.
టమోటా రసం
విటమిన్ 'C'ని పుష్కలంగా కలిగి ఉండే టమోటాలు పాస్పరస్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మరియు సల్ఫర్ వంటి సేంద్రీయ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఈ సమ్మేళనాలన్ని, ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. టమోటాలో ఉండే 'గ్లూటాథాయోన్' రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎరుపు రంగులో, మృదువుగా మరియు తియ్యటి వాసనను కలిగి ఉండే టమోటాలను కొనండి.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







