కాబూలీ శనగల పలావ్
- October 02, 2016
కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - 1కప్పు, కాబూలీ శనగలు - 100 గ్రా., జీలకర్ర - 1 టీ స్పూను, మిరియాలు - 10, లవంగాలు - 4, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, యాలకులు - 3, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 2, నిమ్మకాయ - 1, కొత్తిమీర తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం: కాబూలీ శనగలను ఒక రాత్రంతా నానబెట్టాలి. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులను పొడి చేసుకోవాలి. నెయ్యిలో జీలకర్ర, మసాల పొడి వేగాక, పొడుగ్గా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల తర్వాత అరగంట నానబెట్టి (నీరు వడకట్టిన) బియ్యం, శనగలు వేసి 3 నిమిషాలు అడుగంటకుండా కలపాలి. తర్వాత 2 కప్పుల నీరు, ఉప్పు, నిమ్మరసం వేసి ఒక విజిల్ రాగానే మంట తీసేయాలి. రైతాతో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







