'ఇజం' లో నందమూరి కల్యాణ్‌రామ్‌ కొత్త లుక్‌తో

- October 02, 2016 , by Maagulf
'ఇజం' లో నందమూరి కల్యాణ్‌రామ్‌ కొత్త లుక్‌తో

పూ రి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఇజం'. నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడు. అదితి ఆర్య కథానాయిక. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 5న ఈచిత్ర గీతాల్ని విడుదల చేయనున్నారు. ''కల్యాణ్‌రామ్‌ పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తారు. సిక్స్‌ప్యాక్‌తో విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. ఓ సామాజిక అంశం నేపథ్యంలో సాగే చిత్రమిద''ని చిత్రబృందం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com