మంజు వారియర్ హీరోగా అరవింద్‌స్వామి
- October 02, 2016
1990లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు అరవింద్‌స్వామి. అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన నటించిన 'తని ఒరువన్' మంచి గుర్తింపు తెచ్చింది. కెరీర్ పరంగా ఆయన రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా మారింది. భిన్నమైన పాత్రలో ఇంటెలిజెంట్ విలన్‌గా నటించి మెప్పించారు. ఆయన శైలి నచ్చినందువల్లే ఈ సినిమా తెలుగు రీమేక్‌లో కూడా అరవింద్‌స్వామినే నటించాలని నటుడు రాంచరణ్ కూడా పట్టుబట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన 'బోగన్'లో మళ్లీ జయంరవితో కలసి నటిస్తున్నారు. తాజాగా 'చదురంగవేట్టె 2' సినిమాలో నటించేందుకు కూడా అంగీకరించారు.
ఇందులో ఆయనకు జంటగా త్రిష నటించడం విశేషం. ఈ నేపథ్యంలో మరో కొత్త సినిమాకు కూడా అరవింద్ సిద్ధమయ్యారు. విజయ్ హీరోగా 'తిరుమలై' సినిమాను రూపొందించిన రమణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
మంజు వారియర్ నటిస్తున్న తొలి తమిళ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







