తమిళంలో మాస్, యాక్షన్ హీరోయిన్‌గా రాయ్‌లక్ష్మి..
- October 02, 2016
నిత్యం వార్తల్లో నిలిచే రాయ్‌లక్ష్మి ఈ మధ్య కోలీవుడ్ సినిమాకు దూరమయ్యారు. 'అరన్మణై', 'సౌకారుపేట్టె' వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. 'అకిరా', 'జూలి 2' సినిమాల్లో నటించారు. మరోవైపు మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తమిళంలో మాస్, యాక్షన్ హీరోయిన్‌గా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. 'గర్జనై' అనే సినిమాలో ఆమె ఈ పాత్ర పోషించారు. ఇందులో 'కల్యాణం ముందల్ కాదల్ వరై' ధారావాహికలో నటించే అమిత్ హీరోగా నటిస్తున్నారు. విలన్‌గా వంశీకృష్ణ నటిస్తున్నారు.
కథలోకి వెళితే.. ప్రేమికుడు అమిత్‌ను విలన్ హతమార్చడంతో.. రాయ్‌లక్ష్మి యాక్షన్ హీరోయిన్‌గా మారుతుందని సమాచారం. ఆ తర్వాత విలన్‌ను చంపి ఎలా పగ తీర్చుకుంటున్నదే కథ.
ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఓ పెద్ద బిల్డింగ్‌లో రోప్ సాయంతో ఆమె పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గ్లామర్ సన్నివేశాలకు కూడా ఈ సినిమాలో ఏమాత్రం కొదవుండదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







